అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ప.గో. జిల్లాలో బుధవారం ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిరుజల్లులు పడటంతో రైతులకు ఆందోళనను గురవుతున్నారు. దీంతో రైతులు ధాన్యం బస్తాలను ఒక చోటకి చేర్చే హడావిడిలో పడ్డారు. ధాన్యం పట్టుబడుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. పంట కోత కోయని రైతులు కొన్ని రోజులు ఆగాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.