చింతలపూడిలో నూతనంగా నిర్మితమవుతున్న వంద పడకల ఆసుపత్రికి నాసిరకం ఇసుక వాడుతున్నారని వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా బుధవారం చింతలపూడి ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ నారాయణరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించి వెంటనే పనులు నిలుపుదల చేయడం జరిగింది. కాంట్రాక్టర్లు నాసిరకం మెటీరియల్ వాడితే వారిని వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు.