దెందులూరులో రసవత్తరంగా ఎన్నికల పోరు

82చూసినవారు
దెందులూరులో రసవత్తరంగా ఎన్నికల పోరు
ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో 1955 నుండి 2019 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 7 సార్లు కాంగ్రెస్, 6 సార్లు తెలుగుదేశం పార్టీ, స్వతంత్ర పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కోసారి గెలుపొందాయి. దెందులూరు నియోజకవర్గంలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి కోటారు అబ్బయ్య చౌదరి, కూటమి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, కాంగ్రెస్ నుండి ఆలపాటి నరసింహ మూర్తి పోటీ పడుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే దెందులూరు గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా ఉండనున్నది.

సంబంధిత పోస్ట్