దెందులూరు మండలం శౌరిపురంలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పునీత ఫ్రాన్సిస్ శౌరి మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ పవిత్ర క్రిస్మస్ మాసం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే చర్చ్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.