ఏలూరు నగరంలో మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు కూటమి నేతలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం మంత్రి కలెక్టరేట్లో జరిగే ఏలూరు జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏలూరు బైపాస్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.