ఈ నెల 27న నిర్వహించే జిల్లా యువ ఉత్సవాల్లో యువత తమ ప్రతిభ పాటవాలను నిరూపించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ, జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఉత్సవ్ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు.