తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం ఏలూరు విచ్చేసారు. క్రాంతి కల్యాణ మండపం సమీపంలోని స్థలంలో ‘హలో లోకేశ్’ పేరిట ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సభా ప్రాంగణానికి లోకేష్ చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు.