ఏలూరు జిల్లాలో రేపు కొన్ని స్కూళ్లకు సెలవు

61చూసినవారు
ఏలూరు జిల్లాలో రేపు కొన్ని స్కూళ్లకు సెలవు
ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా మంగళవారం కొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో అబ్రహం సోమవారం సాయంత్రం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని భీమడోలులో 1, పెదపాడులో 7, మండవల్లిలో 18, కైకలూరులో 9, ఏలూరులో 1, ముదినేపల్లిలో 3, కలిదిండిలో 5 స్కూళ్లకు సెలవు ఉంటుందన్నారు. అలాగే మిగతా పాఠశాలలు యధావిధిగా నడపవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్