అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే పెన్షన్ల పెంపు హామీని నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం నగరంలోని 30, 32 డివిజన్లలో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో లక్ష్యసాధన దిశగా కొనసాగుతోందన్నారు.