ద్వారకాతిరుమల మండలం ఎం. నాగులపల్లి పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా భీమడోలు మండలం అంబరుపేట, వసంతకాలనీ ప్రాంతంలో చిరుత పాదముద్రలు ఉన్నాయన్న సమాచారంపై అటవీశాఖ అధికారులు చెరుకుతోటల వద్ద పరిశీలించి చిరుత సంచారాన్ని నిర్ధారించారు. దేనితో రాజమండ్రి పరిసర ప్రాంతంలో సంచరించిన చిరుత ఇదేనని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.