ఆక్వా సాగులో కోళ్ల వ్యర్థాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించేలా చర్యలు చేపట్టాలని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చేపల సాగులో మాంసం వ్యర్థాలనే మేతగా వేయడం ఇటీవల విపరీతమైందన్నారు. దీంతో చేపల పరిశ్రమకు దేశవ్యాప్తంగా చెడ్డపేరు రావడంతో పాటు మార్కెట్లో కొనుగోలుకు వెనుకాడుతున్నారని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.