నరసాపురం డిఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జి శ్రీవేదను ఆమె ఛాంబర్లో గురువారం నరసాపురం మున్సిపల్ కమీషనర్ ఎం అంజయ్య కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపల్ రివెన్యూ ఆర్ ఐ నానాజీతో కలిసి పట్టణంలోని పలు సమస్యలపై చర్చించినట్లు మున్సిపల్ సిబ్బంది గంధం ప్రసాద్ తెలిపారు.