ఈ నెల 14న సాగునీటి సంఘాల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని నరసాపురం తహశీల్దార్ టి. రాజరాజేశ్వరి గురువారం తెలిపారు. ఇప్పటికే ఎన్నికల జరిగే గ్రామాల్లో ప్రచారం చేయించామన్నారు. మండలంలో 4 సంఘాలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. రుస్తుంబాద, కొప్పర్రు, వేములదీవి, నరసాపురం సాగునీటి సంఘాల పరిధిలో మొత్తం 16, 328 మంది రైతు ఓటర్లు ఉన్నారన్నారు