నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో డ్వాక్రా మహిళలతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమీషనర్ అంజయ్య పాల్గొని మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సాహంచడమే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. డ్వాక్రా సంఘ మహిళలు తయారుచేసిన వివిధ రకాల వస్తువులను ప్రతి చోటా అమ్మకాలు చేసేలా చూడాలని మరింత డ్వాక్రా సంఘాలను నెలకొల్పి మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ద్వారా చేయూత అందించాలన్నారు.