ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ ఆగష్టు 18 బుధవారం విజయవాడలో తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ వై.వి సుబ్బారెడ్డిని మర్యాదపుార్వకంగా కలసి శాలువ కప్పి, పుష్పగుచ్చంతో సత్కరించి రెండుసారి తిరుమల తిరుపతి దేవస్థానం చెర్మన్ గా పదవీ స్వీకరించిన వై.వి సుబ్బారెడ్డికి శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ వై.వి సుబ్బారెడ్డి దృష్టి రాష్ట్రంలో బ్రాహ్మణులు పడుతున్న కష్టాలు, నష్టాలు , బ్రాహ్మణ సమస్యలు పైన అరగంట పైన చర్చిస్తూ వై.యస్.ఆర్.సిపి పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి నామినేటెడ్ పదవి ఇవ్వాలని సత్యవాడ దుర్గాప్రసాద్ కోరేరు. దానికి వై.వి సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ బ్రాహ్మణ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తెసుకుని వెళ్తాతానని ఆయన చెప్పినట్లుగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొల్లూరు శ్రీనువాసు శర్మ తెలియజేసారు.