నరసాపురం రైల్వే స్టేషన్ నుంచి జనవరి 15, 22 తేదీల్లో రాత్రి 9: 00 కు నెం. 07183 తో నరసాపురం నుంచి కొల్లంకు స్పెషల్ ట్రైన్స్ విజయవాడ-గుంటూరు మీదుగా వెళ్తాయని స్టేషన్ మేనేజర్ మధుబాబు బుధవారం తెలిపారు. అలాగే జనవరి 17, 24 తేదీలలో కొల్లం స్టేషన్ నుంచి ఉదయం 08. 40కు నెం. 07184 తో నరసాపురానికి రైలు వస్తాయని చెప్పారు. పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు స్టేషన్లో రైలు ఆగుతుందన్నారు.