రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్ణయించే ఎక్సైజ్ పాలసీలో భాగంగా దుకాణాల కేటాయింపులో గీత కార్మికులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా సోమవారం రాష్ట్ర ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు.