పాలకొల్లు డిఎన్ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో లీగల్ క్లబ్, ఎన్. ఎస్. ఎస్, మహిళా సాధికార శాఖ, సంయుక్త ఆధ్వర్యంలో గురువారం, గృహ హింస నిరోధం, మహిళల స్వీయరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సఖి సంస్థ ఆధ్వర్యంలో అడ్వకేట్ దుర్గా రాణి పాల్గొని మాట్లాడుతూ ఉచిత న్యాయ, విద్యా, వైద్య సలహాకేంద్రం సేవలు మహిళలందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రిన్సిపాల్ పి. శోభా రాణి, వైస్ ప్రిన్సిపాల్ రవి శంకర్ పాల్గొన్నారు.