పాలకొల్లు: మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

69చూసినవారు
పాలకొల్లు: మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
పాలకొల్లు మండలం ఏనుగువాక లంకలో ఎక్సైజ్ పోలీసులు గురువారం బెల్టు షాపుల ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద 10 మద్యం సీసాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకొని మద్యం సీసాలను సీజ్ చేశామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్