ఉరివేసుకుని గర్భవతి ఆత్మహత్య

50చూసినవారు
ఉరివేసుకుని గర్భవతి ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామంలో ఓ గర్భవతి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రావూరి దేవి ఆరు నెలల గర్భిణీ. ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యచేసుకుంది. కాగా.. అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందంటూ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పొలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్