పెంటపాడు మండలం ఆకుతీగపాడులో రజక సంఘం అధ్యక్షులు పెనుకుదురు నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి ప. గో. జిల్లా రజక సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు పాల్గొని మాట్లాడారు. 343 జీవో ప్రకారం రజక సంఘానికి చెరువు కేటాయించి తీర్మానం చేసినందుకు గ్రామ సర్పంచ్ కి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు.