ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓవర్ యాక్షన్.. ప్రయాణికులు ఆగ్రహం

23863చూసినవారు
ఉండి మండలం కోలమూరు వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓవరాక్షన్ తో శనివారం హడావుడి చేశాడు. మద్యం సేవించి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే కాకుండా దర్జాగా సిగరెట్ కాలుస్తూ హడావుడి చేశాడు. తాడేపల్లిగూడెం డిపోకు చెందిన బస్సు భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళుతుండగా కారును ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు దారి మధ్యలో ఆపారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్