నిడమర్రు మండలం దేవర గోపవరం గ్రామానికి చెందిన సుమారు 200 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన సూచించారు.