రేపు ఆయా ప్రాంతాల్లో పవర్ కట్

78చూసినవారు
రేపు ఆయా ప్రాంతాల్లో పవర్ కట్
ఉంగుటూరు మండలం గొల్లగూడెం సెక్షన్ 33/11 నల్లమాడు సబ్ స్టేషన్ పీఆర్ గూడెం డొమెస్టిక్ ఫీడర్ పరిధిలో మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ అంబేడ్కర్ బుధవారం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎర్రమిల్లిపాడు, కంసాలగుంట, రామచంద్రపురం, గోపాలపురం, పందిరెడ్డిగూడెం పరిధిలో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్