రజకుల వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి సందర్బంగా రజక సంఘం వారి ఆహ్వానం మేరకు ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, గ్రామస్తులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.