ఫైల్ నెంబర్-1 సదరం స్లాట్లను సద్వినియోగం చేసుకోవాలని ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి గురువారం కోరారు. 6 నెలలకు పైగా అనగా (ఏప్రిల్ 15 కి ముందు) వినియోగించని/హాజరు కాని వారి యొక్క సదరం స్లాట్లు రద్దు చేయబడినవన్నారు. కావున ఎవరైనా స్లాట్ బుక్ చేసుకుని అసెస్మెంట్ కు హాజరు కాకుంటే వారి స్లాట్లు రద్దు చేయడం వల్ల అలాంటి వారు ఇప్పుడు అసెస్మెంట్ కోసం తిరిగి మళ్ళీ కొత్త స్లాట్లను బుక్ చేసుకోవచ్చన్నారు.