ఉంగుటూరు: వాకింగ్ లో ప్రథమ స్థానం సాధించిన రామారావు

79చూసినవారు
ఉంగుటూరు: వాకింగ్ లో ప్రథమ స్థానం సాధించిన రామారావు
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగాయి. ఆపోటీల్లో 400 మీటర్ల వాకింగ్ పందెంలో ఉంగుటూరు మండలం నారాయణపురం జడ్పీ ఉన్నత పాఠ శాల సైన్స్ ఉపాధ్యాయుడు గొల్లపల్లి రామారావు ప్రథమ స్థానం సాధించారు. కృష్ణ, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కే ఎస్ లక్ష్మణరావు అభినందించి మెమెంటో, ప్రశంసా పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్