
గణపవరం: పాడి పరిశ్రమల బలోపేతమే లక్ష్యం
పాడి పరిశ్రమల బలోపేతమే లక్ష్యంగా గోకులాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చూట్టిందని ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. శనివారం గణపవరం మండలం పిప్పర గ్రామంలో 2 మిని గోకులం షెడ్లను స్థానిక కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. గ్రామాల్లో పశుపోషణ, కొళ్లు, గొర్రెలు, మేకలు పెంపకానికి మెరుగైన వసతి కల్పిస్తూ పెంపకందార్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.