వైసీపీకి 175 స్థానాలు గెలిచే సత్తా లేదు: సీపీఐ రామకృష్ణ

54చూసినవారు
వైసీపీకి 175 స్థానాలు గెలిచే సత్తా లేదు: సీపీఐ రామకృష్ణ
విశాఖపట్నంలో సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ వై నాట్ 175 అనేది వైఎస్ జగన్ మైండ్ గేమ్ అని వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికలలో గెలిచే సత్తానే ఉంటే ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు మార్చాల్సిన అవసరమే లేదు అని అన్నారు. పార్టీ నేతలను, ప్రభుత్వ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థులు సొంతంగా కాకుండా కేవలం జగన్ పేరు చెప్పి ఓటు అడగాల్సిన పరిస్థితిని కల్పించారని, కాబట్టి ఎవరు పార్టీ వీడినా జగన్ కి నష్టం ఏమీ లేదు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్