జమ్మలమడుగు: అక్రమ టోల్ గేట్ వసూలు రద్దు చేయాలి: డివైఎఫ్ఐ
జమ్మలమడుగు మండల పరిధిలోని ప్రపంచ పర్యాటక కేంద్రం అయిన గండికోటలో గత కొద్ది నెలలుగా వసూలు చేస్తున్న అక్రమ టోల్ గేట్ వసూలును రద్దు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్ బుధవారం ఆర్డీవో సాయిశ్రీకి వినతిపత్రం అందజేశారు. ఎలాంటి అనుమతి లేకుండా టోల్ వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు.