అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనగాం జిల్లా చిల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం పార్టీ మండల కమీటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గురువారం ఈ మేరకు వివిధ డిమాండ్లతో కుడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ సరస్వతికి అందించారు. ఈ కార్యక్రమంలో రాపర్తి రాజు, సాదం రమేష్, సంపత్, ప్రభాకర్, నాగరాజు, లింగయ్య, శ్రీనివాస్, రవి, రామరాజులు పాల్గొన్నారు.