చెన్నూరు మండల కేంద్రంలోని కొండపేట బ్రిడ్జి వద్ద బుధవారం ఘనంగా పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి హాజరయ్యారు. పార్వేట ఉత్సవానికి కొండపేట గ్రామంలో నుండి ఉమామహేశ్వరుడు, చెన్నూరు గ్రామం నుండి గొబ్బెమ్మ పాల్గొన్నారు. నదిలో ప్రజలు కుటుంబ సమేతంగా హాజరై ఉల్లాసంగా పండగను జరుపుకున్నారు. చిన్నారులు మొదలుకొని పెద్దలు సైతం సంతోషంగా గాలిపటాలను వదిలారు.