కార్యకర్త సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం: కమలాపురం ఎమ్మెల్యే
రాష్ట్రంలోని ప్రతి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. శనివారం కడప నగరంలోని పుత్త స్టేట్ లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు రూ. ఐదు లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.