AP: వైసీపీ శాసనమండలిలో బలమైన పార్టీగా ఉంది. అయితే వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ జంపింగ్ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన గుంటూరు జిల్లా గురజాలకు చెందిన చంద్రగిరి ఏసురత్నం అని పుకారులు షికార్లు చేస్తున్నాయి. 2023లో వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. 2029 దాకా ఆయన పదవీ కాలం ఉంది. అయితే ఇప్పుడు ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.