అంగన్‌ వాడిలో బాలింతకు ఆరోగ్య పరీక్షలు

99చూసినవారు
అంగన్‌  వాడిలో బాలింతకు ఆరోగ్య పరీక్షలు
మేళ్ళచెరువు : మండల కేంద్రంలోని 4వ అంగన్‌వాడి కేంద్రంలో గర్భిణీ స్థ్రీలకు, బాలింతలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. అదే విధంగా 0 వయస్సు నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికి బరువులు, ఎత్తులు, జబ్బ చుట్టు కొలతలు తీసుకున్నారు. ఈ సందర్భముగా అంగన్‌వాడి టీచర్‌ ప్రియాంగ్‌ మాట్లాడుతూ ప్రతి గర్భిణి స్త్రీ, బాలింతలు, పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయడం ద్వారా వారి ఆరోగ్య స్థితిగతులను గుర్తించి వారికి పౌష్టికాహారం అందించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఆరోగ్య పరీక్షలు ప్రతి నెల నిర్వహించడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్