భర్త గుట్కా తినడం మానడం లేదని భార్య ఆత్మహత్య
తన భర్త గుట్కా అలవాటు మానుకోవడం లేదని ఓ మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగింది. జలాల్పూర్లో నివాసం ఉంటున్న సులభ్ నామ్‌దేవ్‌కు గుట్కా తినే అలవాటు ఉండడంతో భార్యతో ప్రతి రోజు గడవలు అయ్యేవి. ఈ క్రమంలో గత రాత్రి ఆమె తన భర్తతో మరోసారి గొడవ పడింది. తర్వాత వేరే గదిలోకి వెళ్లి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.