11వ రోజుకు చేరిన తపాల ఉద్యోగుల సమ్మె

75చూసినవారు
11వ రోజుకు చేరిన తపాల ఉద్యోగుల సమ్మె
కోదాడ : కమలేష్‌ చంద్ర కమిటి ఆమలు చేసేంతవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని, ఈ నెల 4న పదివేల మంది తపాలా ఉద్యోగులతో తెలంగాణ ఛీఫ్‌ పిఎంజి ఆఫీసుముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోదాడ తపాల జీడిఎస ఉద్యోగుల సంఘం నాయకడు బుచ్చిబాబు పిలుపు నిచ్చారు. తమ డిమాండ్ల సాధనలో భాగంగా తపాలా ఉద్యోగులు చేస్తున్న సమ్మె శక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భముగా కోదాడ తపాల కార్యాలయం ముందు ఉద్యోగులు విన్నూత రీతిలో కళ్ళకు గంతలు కట్టుకుని, మోకాళ్లపై కూర్చుండి తమ నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ గత 11 రోజులుగా తాము డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మెను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామీన తపాల ఉద్యోగులు చాలిచాలని జీతాలతో ప్రజలకు సేవలందిస్తున్నారని, బ్యాంకులకు ధీటుగా తపాల ఉద్యోగుల తమ విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమన్నారు. కాగా తపాలా ఉద్యోగుల సమ్మెకు స్తానిక కాంగ్రెస్‌ నాయకుడు సంగిశెట్టి గోపాల్‌ సంఫీుబావం తెలిపారు. ఈ కార్యక్రమంలో తపాల ఉద్యోగుల సంఘం నాయకులు సంకతాల మల్లయ్య, కె నాగేశ్వరరావు, జాన్‌పాషా, రమాదేవి, శ్రీనివాస్‌, అరుణ, సింధు, శ్రీకాంత్‌, వెంకటేశ్‌, బాలాజీ, బాబు, బుచ్చిబాబు, కనకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :