రైతులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకుంటాం: సీఎం సిద్ధరామయ్య
తమ భూములను అక్రమంగా వక్ఫ్ ఆస్తులుగా గుర్తించారని కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చెందిన రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య స్పందించారు. రైతులు ఎవరినీ ఖాళీ చేయబోమని, వారికి జారీ చేసిన నోటీసులను ఉపసంహరించు కుంటామని చెప్పారు. మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. రైతులకు నోటీసులు జారీ చేస్తే వాటిని వెనక్కి తీసుకుంటామన్నారు. ఒక్క రైతును కూడా వారి భూమి నుంచి వెళ్లగొట్టబోమని హామీ ఇచ్చారు.