అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్: ప్రధాని నరేంద్ర మోడీ
దేశంలో అత్యంత అవినీతికర పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్‌నేనని మోడీ విమర్శించారు. పీఎం విశ్వకర్మ స్కీమ్‌కు ఏడాది పూర్తి అయిన సందర్భంగా గురువారం మహారాష్ట్రలోని వార్దాలో జరిగిన సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సభలో మోడీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తెలంగాణాలోని రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్ధానం చేసింది. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీ రైతుల్ని పట్టించుకోలేదని మోడీ అన్నారు.