'ఆరోగ్యశ్రీలో చికిత్సలను తొలగించట్లేదు'
ఆరోగ్యశ్రీపై వస్తున్న వార్తలను ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఖండించింది. ఆరోగ్యశ్రీలో ప్రస్తుతం ఉన్న 3,257 చికిత్సలను 1,949కి తగ్గిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. ఆరోగ్యశ్రీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ పథకంలో ఎలాంటి మార్పులను ప్రభుత్వం చేయట్లేదని స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.