నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఈ నెల 21న పదో తరగతి తెలుగు క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఆరుగురిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. ఎగ్జామ్ సెంటర్ సీఎస్ గోపాల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రామ్మోహన్ రెడ్డిని పరీక్ష విధుల నుంచి తప్పించగా, ఇన్విజిలేటర్ సుధారాణిని సస్పెండ్ చేశారు. స్టూడెంట్‌ను డిబార్ చేశారు.