అధిక దిగుబడి, చీడపీడల నివారణ కోసం ఈ మధ్యకాలంలో పంటలపై క్రిమిసంహారకాలు, కలుపు మందులను రైతులు అధికంగా ఉపయోగిస్తున్నారు. పంటకాల పూర్తై విక్రయించిన తర్వాత కూడా పురుగు మందుల అవశేషాలు తొలగిపోవు. మనం తినే వ్యవసాయ ఉత్పత్తుల్లో వీటి అవశేషాలు ఉండటం వల్ల వాటిని సరిగా శుభ్రం చేయకుండా తింటే ఈ అవశేషాలు ప్రతి రోజూ సూక్ష్మ మొత్తంలో మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.