భరతనాట్యంలో ‘అరంగేట్రం’ చేయడం ద్వారా చైనాకు చెందిన 13 ఏళ్ల లీ ముజి అనే విద్యార్థిని చరిత్ర సృష్టించింది. ఈ మేరకు బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ భరతనాట్య కళాకారిణి లీలా శాంసన్, భారత దౌత్యవేత్తలు, పెద్ద ఎత్తున హాజరైన స్థానికుల ఎదుట లీ భరతనాట్యంలో అరంగేట్ర ప్రదర్శన చేసింది. తద్వారా పూర్తిగా చైనాలోనే శిక్షణ పొంది, ఇక్కడే అరంగేట్రం చేసిన తొలి నర్తకిగా రికార్డు సృష్టించింది.