143కి.మీ. స్పీడ్‌తో బైక్‌ను ఢీకొట్టిన ఇన్‌ఫ్లూయెన్సర్.. వీడియో వైరల్

50చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ రజత్ దలాల్ రద్దీ రోడ్డుపై 143కి.మీ. వేగంతో కారు నడపటం వివాదస్పదమైంది. రజత్ ఢిల్లీలోని ఫరీదాబాద్-బదర్‌పూర్ రోడ్డుపై రాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీకొట్టాడు. పైగా 'ఏం పర్లేదు రోజూ నాకు ఇదే పని' అంటూ ఆయన కారులోని యువతితో నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ముందుకెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వగా, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు పోలీసులకు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్