ఛత్తీస్‌గఢ్‌లో 26 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పకడ్బందీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్లలో కూడా పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. ఈ క్రమంలో ఇటీవల 70 మంది మావోయిస్టులు మూకుమ్మడిగా లొంగిపోగా, తాజాగా మరో 26 మంది సరెండరయ్యారు. దంతెవాడ పోలీసులకు తమ ఆయుధాలను అప్పగించి లొంగిపోయారు.