12 ఏళ్ల బాలికపై అత్యాచారం

83చూసినవారు
12 ఏళ్ల బాలికపై అత్యాచారం
యూపీలోని అలీఘర్ సమీపంలో తాజాగా దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలుడు బధిరుడు. తన పక్కింట్లో ఉండే 12 ఏళ్ల బాలికపై ఆ బాలుడు కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి, పారిపోయాడు. బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుని, కుటుంబ సభ్యులకు జరిగిన దారుణం చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జువైనల్ హోమ్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్