రాముడికి ఓ బెంజ్‌.. 10 కోట్ల ఆస్తులు!

1086చూసినవారు
రాముడికి ఓ బెంజ్‌.. 10 కోట్ల ఆస్తులు!
రఘుకులసోముడైన జగదభిరామునికి బెంజ్‌ కారేమిటా అనుకుంటున్నారా? ఇది జగదేక చక్రవర్తి శ్రీరాముడి గురించి కాదు. టీవీ రామాయణంలో రాముని పాత్రధారి అరుణ్‌ గోవిల్‌ గురించి. ఈయన యూపీలోని మీరట్‌ నుంచి లోక్‌సభ బరిలో ఉన్నారు. తనకు రూ.62.99 లక్షల విలువైన మెర్సిడెస్‌ బెంజ్‌తో పాటు రూ.3.19 కోట్ల చరాస్తులు, రూ.5.67 కోట్ల స్థిరాస్తులు, బ్యాంకులో రూ.1.03 కోట్లు, చేతిలో రూ.3.75 లక్షల నగదు ఉన్నట్టు అఫిడవిట్లో గోవిల్‌ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్