యజమానిపై పగ తీర్చుకున్న కుక్క (వీడియో)

72చూసినవారు
అమెరికాలోని కొలరాడోలోని కొలరాడో స్ప్రింగ్ సిటీలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న అలారం మోగింది. ప్రత్యేక పరికరం సాయంతో మంటలు ఆరిపోయాయి. అయితే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు సీసీ ఫుటేజీ చూడగా విస్తుపోయారు. వంట గదిలోకి వెళ్లిన కుక్క అక్కడున్న మైక్రోవేవ్‌ను ఆన్ చేసింది. కాసేపటికి వంటింట్లో మంటలు వ్యాపించాయి. యజమానిపై కోపంతో ఇలా చేసిందేమో అని కొందరు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెట్టారు.

సంబంధిత పోస్ట్