తూర్పు గోదావరి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఒంటరిగా ఉండే ముసలివాళ్ళ ఇళ్లను ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగల ముఠా ఆట కట్టించారు. ఈ మేరకు 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్న నడిపల్లి సూర్యచంద్ర, చక్ర జగదాంబలను అనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 9 లక్షల విలువైన సుమారు 273 గ్రా. బంగారు వస్తువులను రికవరీ చేశారు. నిందితులు గతంలో 10 కేసులలో జైలు శిక్ష అనుభవించారని పోలీసులు తెలిపారు.