హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. అయితే అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తలకిందులుగా ఇరుక్కుపోయాడు. అలాగే 25 నిమిషాల పాటు వేలాడుతూ ఉండటంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే బ్యాటరీ సమస్య కారణంగా ఈ సమస్య తలెత్తిందని సిబ్బంది తెలిపారు.